Saturday, January 18, 2025
Homeసినిమాఎఫ్ 3 వెంకీకి విక్ట‌రీ అందించేనా..?

ఎఫ్ 3 వెంకీకి విక్ట‌రీ అందించేనా..?

F3 : విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన తాజా చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాకి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ 3 సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నెల 27న ఎఫ్ 3 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా ఫ‌లితం అనేది వెంకీకి కీల‌కంగా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… విడుదలకు ముందు నుంచే ఎఫ్ 3 సినిమా యూనిట్ లో నవ్వులు కనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్ పక్కా అనే గ‌ట్టి న‌మ్మ‌కం అందర్లో ఉంది కానీ.. ఒక్కరు మాత్రం టెన్షన్ పడుతున్నారు. అతడే విక్టరీ వెంకటేష్. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు వెంకీ. వెంకటేష్ నుంచి చివరిసారి థియేటర్లలోకి వచ్చిన సినిమా వెంకీమామ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేదు.

ఆతర్వాత వెంకటేష్ న‌టించిన నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాలు ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలయ్యాయి. దీంతో వెంకీ థియేట్రికల్ మార్కెట్ పై అనుమానాలు పెరిగాయి. ఇలాంటి టైమ్ లో థియేటర్లలోకి వస్తోంది ఎఫ్ 3 సినిమా. అందుకే ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు వెంకటేష్. ప్ర‌జెంట్ తన మార్కెట్ ఎంత అని తనే చెక్ చేసుకోబోతున్నాడు. మ‌రి.. వెంకీకి ఎఫ్ 3 ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్