‘నకిలీ’, ‘డా.సలీమ్’, ‘బిచ్చగాడు’, ‘భేతాళుడు’, ‘ఇంద్రసేన’, ‘రోషగాడు’, ‘కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ రూపొందించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కోడియిల్ ఒరువన్ పేరుతో తమిళంలో విజయ రాఘవన్ పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
‘ఇది వరకే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు, టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్క దారులు పట్టకుండా… చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, వారి ఉన్నతికి పాటు పడే యువకుడి కథే విజయ్ రాఘవన్. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెరకెక్కించాం. డిఫరెంట్ పాత్ర. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఆనంద కృష్ణన్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను కవర్ చేస్తూ తెరకెక్కించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 17న ప్రేకకుల ముందుకు తీసుకొస్తున్నాం. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది.