Sunday, January 19, 2025
Homeసినిమామేజర్ టీమ్ కు విజయ్ దేవరకొండ అభినందనలు

మేజర్ టీమ్ కు విజయ్ దేవరకొండ అభినందనలు

Outstanding:  వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయి అని కితాబిచ్చారు.

ముంబై ఉగ్రదాడి అమరుడు, వందల మందిని కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన ఈ  మేజర్ సినిమాను ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని హైదరాబాద్ లో చూసిన విజయ్.. సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయని అన్నారు. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమని, దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు గొప్పవారని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : అంచనాలను అందుకున్న ‘మేజర్’  

RELATED ARTICLES

Most Popular

న్యూస్