Friday, October 18, 2024
Homeసినిమావిజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం పిక్స్ అయ్యిందట. ఇంతకీ ఎప్పుడంటే.. ఈ నెల 12న అని తెలిసింది. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన కొంత టాకీ పార్ట్ అమెరికాలో తీయాలి. అందుకనే పరశురామ్ ప్రస్తుతం అమెరికాలో లోకేషన్స్ చూస్తున్నాడని సమాచారం.

మరో రెండు రోజుల్లో పరశురామ్ హైదరాబాద్ వస్తాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. ఇందులో విజయ్ కు జంటగా కథానాయిక మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇందులో మరో కథానాయిక కూడా ఉంది. ఆమె కోసం చిత్రయూనిట్ అన్వేషిస్తోంది. మరో వైపు విజయ్ చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మూడు రోజులు షూటింగ్ చేస్తే సమంత పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓ వారం షూటింగ్ చేస్తే మొత్తం పూర్తవుతుంది. అందుకనే పరశురామ్ తో చేయనున్న సినిమాకి విజయ్ డేట్స్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్, ‘కుటుంబరావ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే.. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కే ఫిక్స్ అయ్యారని తెలిసింది. లైగర్ సినిమా తర్వాత విజయ్ గ్యాప్ వచ్చింది. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. అందుకనే సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరితో కూడా సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకురానున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్