Monday, January 20, 2025
Homeసినిమావిజయ్ దేవరకొండ న్యూ మూవీ లాంచ్..

విజయ్ దేవరకొండ న్యూ మూవీ లాంచ్..

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. హీరోగా ఆయనకు 13వ సినిమా దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేశారు.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించనుందనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది.

హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగు మొదలైంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది.

‘గీత గోవిందం’ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగును నమోదు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో  ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరిందన్న మాట. నాని జోడీగా ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఠాకూర్, హఠాత్తుగా విజయ్ దేవరకొండ సరసన మెరవడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్