రామ్ చరణ్- డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా ఉంటుందని, ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తారని చాలాకాలం ప్రచారం జరిగింది. గౌతమ్ హిందీ ‘జెర్సీ’ సరిగా ఆడలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. చరణ్ తో సినిమా ఆగిపోయింది. గౌతమ్ సితార సంస్థ ద్వారా ఈ కథను విజయ్ దేవరకొండ విని ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ చేశారు. విభిన్న కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో విజయ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా మొదలైంది. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో, చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. ‘గూఢచారి’ సినిమాతో స్పై థ్రిల్లర్ కు డిమాండ్ పెరిగింది. ఇటీవల ఏజెంట్, త్వరలో నిఖిల్ ‘స్పై’ కూడా ఈ కోవలోనివే.
హిందీలో తెరకెక్కించిన జెర్సీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి గౌతమ్ ది. చరణ్ నో చెప్పిన కథను పక్కనపెట్టి విజయ్ కోసం మరో కొత్త కథ రాశాడని అందరూ అనుకున్నారు. కానీ గతంలో చరణ్ చేయాలనుకున్నదే ఇప్పుడు విజయ్ చేస్తున్నాడట.