Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్

Liger another record: పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌తో స‌క్సెస్ సాధించి సంచ‌ల‌నం సృష్టించిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కెరీర్ స్టార్ట్ చేసిన అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న స్టార్లలో విజయ్ ఒకరు. అయితే.. డియ‌ర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా వ‌చ్చి రెండేళ్ల అవుతుంది. అప్ప‌టి నుంచి రౌడీ హీరో సినిమా రాలేదు. ప్ర‌స్తుతం పూరి డైరెక్ష‌న్ లో లైగ‌ర్ మూవీ చేస్తున్నాడు. అలాగే జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం కూడా చేస్తున్నాడు.

ఇదిలా  ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సాధించిన ఫాస్టెస్ట్‌ సౌత్‌ ఇండియా హీరోగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 15 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన సౌత్‌ హీరోగా రికార్డుకెక్కాడు రౌడీ హీరో. టాలీవుడ్‌లో విజయ్‌ కంటే ముందుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 18 మిలియనల్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

తర్వాత 8.3 మిలియన్లతో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 8.1 మిలియన్లతో మహేష్‌ బాబు ఉన్నారు. వీరిద్దరి కంటే విజయ్‌ ముందుండటం విశేషం. ఇక లైగ‌ర్ మూవీతో ఆగ‌ష్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Also Read : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ‘జేజీఎం’ (జనగణ మన)

RELATED ARTICLES

Most Popular

న్యూస్