సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్‘ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ డిజాస్టర్ అయ్యింది. ఇది విజయ్ కి పెద్ద షాక్ అని చెప్పచ్చు. లైగర్ సినిమా ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ పెద్దగా సోషల్ మీడియాలో రియాక్ట్ కాలేదు. ఆ సినిమా విడుదల తర్వాత మళ్లీ ఆయన.. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు సంతాపం తెలిపేందుకే ట్వీట్ చేశారు.
తాజాగా విజయ్ ‘సింగిల్ ప్లేయర్’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీటే అర్థం కాక నెటిజన్లు.. దీనర్థమేమీ.. విజయ్ దేవరకొండా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింగిల్ ప్లేయర్ అంటూ ఆయన పోస్ట్ చేసిన పిక్‌లో చాలా స్టయిలీష్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. పిక్ వరకు నో ప్రాబ్లమ్.. కానీ సింగిల్ ప్లేయర్ అనే పదమే అనేకానేక అనుమానాలకు తావిస్తోంది.
అయితే.. ఇప్పటి వరకు తన నిర్ణయం కాకుండా.. తన టీమ్ చెప్పినట్టుగా..కథలు ఓకే చేశాడు. ఇక నుంచి అలా కాకుండా తన ఆట తనే ఆడాలనుకుంటున్నాడని.. అందుకనే సింగిల్ ప్లేయర్ అని ట్వీట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇది నిజమో కాదో.. విజయ్ మనసులో ఏముందో.. మరోసారి క్లారిటీగా ట్వీట్ చేస్తాడేమో చూడాలి.
Also Read : ‘లైగర్’ ఫ్లాప్ – సోషల్ మీడియాకు బ్రేక్