Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ తో కరణ్‌ మరో మూవీ..?

విజయ్ తో కరణ్‌ మరో మూవీ..?

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. ఈ చిత్రాన్ని పూరితో కలిసి కరణ్‌ జోహార్ నిర్మించారు. భారీ అంచనాలతో రూపొందిన లైగర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కు లైగర్ మూవీ భారీగా నష్టాలను తీసుకువచ్చింది.
పారితోషికం పరంగా కూడా విజయ్ కి ఆ సినిమా నష్టమే. సినిమా విడుదల తర్వాత తీసుకుందామని చాలా తక్కువ మొత్తమే అడ్వాన్స్ గా తీసుకున్నాడట. ఇప్పుడు సినిమా పోవడంతో… రావాల్సిన డబ్బులు కూడా రాలేదని టాక్ వినిపిస్తోంది.

మరో విషయం ఏంటంటే.. పూరికి, విజయ్ కి మధ్య ఇప్పుడు మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవట. మరి.. లైగర్ మూవీని హిందీలో ప్రెజెంట్ చేసి ఎంతో హడావిడి చేసిన కరణ్ జోహార్ తో బంధాలు ఎలా ఉన్నాయంటే… కరణ్, పూరి మధ్య కూడా రిలేషన్స్ కట్. కానీ, విజయ్ , కరణ్ మధ్య మాత్రం అదే స్నేహం ఉందట. బాలీవుడ్ లో తాను సరిగా లాంచ్ చెయ్యలేకపోయాను అనే ఉద్దేశంతో విజయ్ కి మరో మంచి ప్రాజెక్ట్ సెట్ చేస్తానని అంటున్నారట కరణ్ . విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి‘ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు. త్వరలో ఈ సినిమాని ప్రకటిస్తారని సమాచారం. అయితే… గౌతమ్ తో మూవీ తర్వాత కరణ్ జోహార్ తో విజయ్ బాలీవుడ్ మూవీ చేస్తాడని తెలిసింది. విజయ్ ని హిందీలో లవర్ బాయ్ గా ప్రెజెంట్ చేద్దామని భావిస్తున్నాడు కరణ్ . మరి.. ఈ సినిమాతో అయినా విజయ్ బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తాడేమో చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్