Sunday, September 22, 2024
Homeసినిమా‘విజ‌య రాఘ‌వ‌న్‌’ పై బోలెడు ఆశలు పెట్టుకున్న విజ‌య్ ఆంటోని

‘విజ‌య రాఘ‌వ‌న్‌’ పై బోలెడు ఆశలు పెట్టుకున్న విజ‌య్ ఆంటోని

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఆయన హీరోగా ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌  రూపొందించిన ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువ‌న్‌’ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌ పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’  పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా రైట‌ర్ భాష్య‌శ్రీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, అనువాదంలో వ‌ర్క్ చేసిన అంద‌రూ సినిమా గ్యారంటీ హిట్ అని చెప్పారు. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప‌ని చేసే అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో విజ‌య రాఘ‌వ‌న్‌గా న‌టించిన విజ‌య్ ఆంటోని గారు ఓ ట్యూష‌న్ మాస్ట‌ర్‌. త‌న అమ్మ క‌న్న క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి ఓ ప్రాంతానికి వ‌స్తాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా డైమ‌న్ష‌న్స్ ఉంటాయి. చాలా విభిన్నంగా ఉండే సినిమా’’ అన్నారు.

చిత్ర దర్శకుడు ఆనంద కృష్ణ‌న్ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘మెట్రో’ తెలుగులో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా విడుదలవుతుండటం హ్యాపీగా ఉంది. తెలుగులో గ్రాండ్‌గా సినిమా విడుద‌ల‌వుతుంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. జీవితంలో ఎన్నో సాధించాల‌నుకునే హీరో, త‌న త‌ల్లి కోరిక‌ను తీర్చాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి త‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేదే ఈ చిత్రం. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అంతే కాకుండా.. స‌మాజంలో మ‌న‌కు ఎదుర‌య్యే రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాల‌నే సందేశం కూడా ఇస్తుంది. ఇలాంటి ఓ సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు, విజ‌య్ ఆంటోనిగారికి థాంక్స్‌. నివాస్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక చాలా మంచి రోల్‌ను క్యారీ చేసింది. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న సినిమాను ఆద‌రించండి’’ అన్నారు.

హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ “ కిల్లర్ సినిమా తర్వాత ప్యాండ‌మిక్ కార‌ణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకునే అవ‌కాశ‌మే లేకుండా పోయింది.  కొంత గ్యాప్ త‌ర్వాత విజ‌య రాఘ‌వన్ వంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం హ్యాపీగా ఉంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ఇంత‌కు ముందు మెట్రో అనే సినిమాను తెర‌కెక్కించారు. చాలా మంచి ద‌ర్శ‌కుడు. విజ‌య రాఘ‌వ‌న్ సినిమాను నిర్మించిన రాజా గారు, క‌మ‌ల్‌ గారు, ప్ర‌దీప్‌ గారికి, ధ‌నంజ‌య‌న్‌ గారికి ఇత‌రుల‌కు థాంక్స్‌. బాగా ఖ‌ర్చు పెట్టి ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న శ్రీక‌రి ఫిలింస్ ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డిల‌కు థాంక్స్‌, అభినంద‌న‌లు.’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్