Friday, April 19, 2024
Homeసినిమావిజయ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

విజయ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

విజయ్ హీరోగా టాలీవుడ్  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వరిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. రంజితమే .. రంజితమే అంటూ ఈ పాట సాగుతోంది. జోరుగా హుషారుగా సాగే ఈ బీట్ కి విజయ్ ఒక రేంజ్ లో స్టెప్స్ వేశాడనే విషయం ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. గతంలో విజయ్ ‘బీస్ట్’ లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అరబిక్ కుతు డ్యాన్స్ ఏ స్థాయిలో జనాల్లోకి దూసుకెళ్లిందో తెలిసిందే. అందువల్లనే వరిసు సినిమాలోని ఈ పాటకు జానీ మాస్టర్ కే విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన నమ్మకాన్ని జానీ మరింత పెంచాడనే అనిపిస్తోంది. పూర్తి సాంగ్ ను 5వ తారీఖున రిలీజ్ చేయనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ప్రభు, శరత్ కుమార్,  శ్రీకాంత్, స్నేహ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారని సమాచారం. మరి.. ఈ సినిమాతో విజయ్ తెలుగులో ఎంత వరకు మెప్పిస్తాడో.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాడో చూడాలి.

Also Read : చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న’వారసుడు’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్