Friday, May 2, 2025
HomeTrending Newsకాంగ్రెస్‌లోకి విజయారెడ్డి

కాంగ్రెస్‌లోకి విజయారెడ్డి

దివంగత పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్‌లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా… మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భాగ్యనగరంలో కాంగ్రెస్ పూర్వవైభవానికి తొలి అడుగు పడిందన్నారు. కాంగ్రెస్ రక్తం ప్రవహించే నాయకత్వం తిరిగి సొంత గూటికి చేరుకుంటున్న సందర్భం. పేదల దేవుడు పీజేఆర్ గారి వారసత్వం రాకతో గ్రేటర్ కాంగ్రెస్ కు జవసత్వం రాబోతోందన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం శుభపరిణామమని,  పీజేఆర్ ఆశయ సాధనలో పార్టీ ఎళ్లవేళలా విజయమ్మకు తోడుగా ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్