తనపై వచ్చిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతోందని, సహాయం కోసం అధికారి శాంతి తనను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా? అంటూ ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశంపై విజయసాయి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు.
నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారని, తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూడా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే ఈ ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. ఈ తాటాకు చప్పట్లు భయపడనని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా, మరో ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు తన ప్రతిష్ట దిగజారిచే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు.
చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా అంటూ త్వరలోనే ఛానల్ పెడతానని వెల్లడించారు. ఒక సెక్షన్ అఫ్ మీడియా హద్దులు దాని తనపై లేనిపోని ఆరోపణలు చేసిందని…. తనపై ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్, ట్రైబల్ కమిషన్.. చివరకు
పార్లమెంటు వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. దీనిపై రాజ్యసభలో ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెడతానన్నారు. ‘బుద్ధి లేనివాడు ఎవడైనా తండ్రి వయసున్న నాకే ఒక ఆదివాసి మహిళను అంటగడతారా’ అంటూ నిలదీశారు.