Monday, February 24, 2025
HomeTrending Newsఅదో వండి వార్చిన కథనం : విజయసాయి

అదో వండి వార్చిన కథనం : విజయసాయి

Its not true: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతోందంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప్రతిసారీ ఇలాంటి వార్తలు వండి వార్చడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు.

“ టీడీపీని జనం చెప్పుతో కొట్టినప్పుడల్లా కరకట్ట అక్రమకొంపలో ఎదో కథనం వండుతారు. దాన్ని ‘అంధ’జ్యోతిలో మోస్తారు. అసంతృప్తి వైసీపీలో కాదు చంద్రబాబు,రాధాకృష్ణ మెదళ్లలో ఉంది. కుక్కతోకలాగే వారి బుద్దీ వంకరే. మొన్నటిదాకా ఉద్యోగుల్లో అసంతృప్తన్నారు. ఆత్మకూరు ఫలితం తర్వాత నోరు మూసుకున్నారు” అంటూ ట్వీట్ చేశారు.

గత పది రోజులుగా నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో జరుగుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కార్యక్రమాల్లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసే క్రమంలో పార్టీలో నెలకొన్న  పరిస్థితిపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై  సదరు పత్రిక నేడు ప్రధాన వార్తా కథనం ప్రచురించింది.  దీనిపై విజయసాయి తీవ్రంగా స్పందించారు.

Also Read : బాబుది నాసిరకం రాజకీయం : విజయసాయి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్