Monday, February 24, 2025
HomeTrending Newsటిడిపిపై విజయసాయి పంచ్ లు

టిడిపిపై విజయసాయి పంచ్ లు

Vijaya sai Punches: మహానాడులో తెలుగుదేశం  నేతలు సిఎం జగన్, వైఎస్సార్సీపీ పై చేసిన వ్యాఖ్యలను రాజ్య సభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టి నేటికి మూడేళ్ళు అయిన సందర్భంగా జరిగిన సభలో అయన మాట్లాడుతూ టిడిపి పై పంచ్ డైలాగులతో విరుచుకు పడ్డారు. మహానాడులో పార్టీ నేతలు తమను బూతులు తిడుతుంటే చంద్రబాబు ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారని, దాన్నే శునకానందం అంటారని విమర్శించారు.

విజయసాయి మాట్లాడుతూ…

  • టిడిపి అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తొడలు దేహం పార్టీ
  • నారా లోకేష్, అయ్యన్న పాత్రుడు బూతులు మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. వారిని వారించకుండా చూస్తూ కూర్చున్న చంద్రబాబు ఓ ప్రతిపక్ష నాయకుడేనా?
  • సిబీఎన్ అంటే అసలు చంద్రబాబు నాయుడు… కానీ ఇప్పుడు చంద్ర బూతుల నాయుడుగా మారింది
  • పార్టీ నేతలు బూతులు తిడుతుంటే బాబు మొహం వెలిగిపోతుంది, ఇదేనా బాబు రాజకీయ అనుభవం? వారు తిడుతుంటే వారించాల్సిన అవసరం లేదా?
  • చంద్రబాబు సింపతీ కోసం ఏడుస్తున్నారు.

అంటూ వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు నారా లోకేష్ చవట, దద్దమ్మ అని తెలిసే దత్తపుత్రుడిని నమ్ముకున్నారని ధ్వజమెత్తారు.

Also Read : బాబుది నాసిరకం రాజకీయం : విజయసాయి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్