Saturday, January 18, 2025
Homeసినిమా‘శరపంజరం’ పాట విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్

‘శరపంజరం’ పాట విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది? ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వీరి పై ఎలాంటి  వ్యతిరేకత కనబరిచారు అనే  పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలిమ్స్ పతాకం పై టి.గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని “రావయ్యా నందనా రాజా నందన ” రెండవ పాటను ప్రముఖ జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి పాడిన ఈ పాటను లేడి సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేశారు

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ “ఈ చిత్రంలోని పాట చూశాక పల్లెదనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆనాడు దొరలు తమ స్వార్ధం కోసం ఆడవాళ్ళని ఎలా వాడుకున్నారో అందరికి తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో మనం చూస్తున్నదే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదు అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది అనిపిస్తుంది. ఈ జీరో బడ్జెట్ సినిమా పెద్ద హిట్ కావాలని చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అన్నారు .

Also Read ‘శరపంజరం ‘ మొదటి పాటను విడుదల చేసిన‌ విజయేంద్రప్రసాద్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్