Saturday, January 18, 2025
Homeసినిమాచావును ఎదిరించేవారికి మాత్రమే ఇక్కడ జీవితం: 'తంగలాన్' 

చావును ఎదిరించేవారికి మాత్రమే ఇక్కడ జీవితం: ‘తంగలాన్’ 

కోలీవుడ్ లో కథల పరంగా .. పాత్రల తాలూకు గెటప్స్ పరంగా ప్రయోగాలు చేయడంలో, కమల్ తరువాత స్థానంలో విక్రమ్ కనిపిస్తాడు. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా వెనుకాడని నటుడు ఆయన. గతంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలు. అలా ఆంగ్లేయుల కాలంలో ఒక గిరిజన తెగకి చెందిన వ్యక్తిగా ఆయన నటించిన సినిమానే ‘తంగలాన్’. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ సినిమా రెడీ అవుతోంది.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి, పా రంజిత్ దర్శకత్వం వహించాడు. చాలా రోజుల క్రితమే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా వదిలిన ట్రైలర్ ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తిని .. ఆత్రుతను పెంచుతోంది. మాళవిక నాయర్ .. పార్వతి తిరువోతు .. పశుపతి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

అది ఆంగ్లేయులు ఇక్కడ తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్న కాలం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో వారు తవ్వకాల కోసం ప్రయత్నించే సమయం. అప్పుడు వారు అక్కడికి సమీపంలోని ఒక గిరిజన తెగ సాయాన్ని కోరతారు. బంగారం తవ్వకాల విషయంలో వాళ్లకి ఒక మాంత్రికురాలు అడ్డుపడుతూ ఉంటుంది. ఆమెను ఎదుర్కోవడానికి కథానాయకుడు సిద్ధమవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందనేదే కథ. ‘చావును ఎదిరించేవాళ్లకి వాళ్లకి మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ విక్రమ్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్