Sunday, February 23, 2025
Homeసినిమానాడు ‘జయం’ ... నేడు ‘విక్రమాదిత్య’

నాడు ‘జయం’ … నేడు ‘విక్రమాదిత్య’

Teja Active: బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఓ సినిమాను రూపొందిస్తోంది. ఇవాళ షూటింగ్‌ స్టార్ట్ అయిన ఆ సినిమాకు ‘విక్రమాదిత్య’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎపిక్‌ లవ్‌ స్టోరీగా విక్రమాదిత్యను డిజైన్‌ చేశారు తేజ. ‘విక్రమాదిత్య’ను భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు.  ఫస్ట్ ఆఫ్‌ ఇట్స్ కైండ్‌ లవ్‌ స్టోరీ అన్నట్టు పోస్టర్‌ని డిజైన్‌ చేశారు.

1836లో జరిగిన కథగా పోస్టర్‌ని బట్టి అర్థమవుతోంది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ దవళేశ్వరం బ్రిడ్జిని కట్టిన సమయంలో జరిగిన కథగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమకు బ్రిడ్జితోనూ అనుబంధం ఉన్నట్టు చూపించనున్నారు. 22.2.22న ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. 20 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘జయం’ మూహూర్తం జరిగిన క్షణాలను గుర్తుచేసుకున్నారు తేజ. పాపులర్‌ ఆర్టిస్టులతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్