Saturday, January 18, 2025
HomeTrending Newsభావోద్వేగానికి గురైన ఫోగట్

భావోద్వేగానికి గురైన ఫోగట్

రెజ్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్  50 కిలోల విభాగంలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్స్ పోరుకు దూరం కావాల్సి వచ్చిన వినేష్ నేడు స్వదేశానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఫొగట్ కు అశేష జనసందోహం సాదర స్వాగతం పలికింది.

క్రీడాభిమానులు, సహచర ఆటగాళ్ళు తనపై చూపిస్తోన్న అభిమానం తట్టుకోలేని వినేష్ ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.  రెజ్లర్లు  బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులు ఆమెకు స్వాగతం పలికి ఓదార్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్