Sunday, January 19, 2025
Homeసినిమాఉగాదికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గిఫ్ట్.?

ఉగాదికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గిఫ్ట్.?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఈ మూవీ రిలీజ్ కావాల్సింది కానీ.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’, ‘వినోద సీతం’ రీమేక్ ప్రారంభించారు. ప్రస్తుతం వినోదయ సీతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

వినోదయ సీతం రీమేక్ లో పవర్ స్టార్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు డేట్స్ ఇచ్చారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఒకటి కాదు.. రెండు మూడు యూనిట్లతో షూటింగ్ చేస్తున్నారు. వినోదయ సీతం తమిళ్ లో సక్సెస్ సాధించింది. అయితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఉగాది సందర్భంగా వినోదయ సీతం నుంచి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ లుక్ విడుదల చేయాలి అనుకుంటున్నారు. అయితే.. ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది. ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేయాలి అనేది ప్లాన్. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. మరి… పవన్, సాయిధరమ్ తేజ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్