Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ మూవీ పిక్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

పవన్ మూవీ పిక్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్.. వీరిద్దరి కాంబినేషన్లో ‘వినోదయ సీతం‘ రీమేక్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్‌ 25 రోజులు డేట్స్ కేటాయించారు. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.

వినోదయ సీతమ్ సినిమా రీమేక్ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా మరోసారి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఆ ఫొటోలను డిలీట్ చేయించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఫోటోలను చాలా మంది షేర్ చేసుకున్నారు. పర్సనల్ గా షేర్ చేసుకుంటూ తమ అభిమాన హీరో లుక్ మరియు సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

అయితే… ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ లీక్ అయినా పర్వాలేదు కానీ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం సినిమా లీక్ అయిన ఫొటోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అభిమానుల వద్దకు వచ్చిన లీక్ ఫొటోలను వెంటనే డిలీట్ చేయాలని యూనిట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేయాలి అనుకుంటున్నారని సమాచారం. పవన్, తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా, అభిమానులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. మరి.. మేనమామ, మేనల్లుడు కలిసి ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్