వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ కు జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఫాం లో లేని కారణంగా విరాట్ కోహ్లీకి జట్టునుంచి ఉద్వాసన పలికారు.  కెఎల్ రాహూల్, కుల్దీప్ యాదవ్ లను జట్టులో చోటు దక్కినా వారి గాయాల పరిస్థితిని అంచనా వేసి తుది జట్టులో స్థానం కల్పిస్తామని బిసిసిఐ వెల్లడించింది. కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లను కూడా తప్పించారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించారు.

జట్టు వివరాలు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్,  కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్,  హర్షల్ పటేల్, ఆర్షదీప్ సింగ్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *