Sunday, January 19, 2025
HomeసినిమాSai Dharam Tej: సాయితేజ్ కి 'విరూపాక్ష' ఒక పెద్ద టెస్ట్! 

Sai Dharam Tej: సాయితేజ్ కి ‘విరూపాక్ష’ ఒక పెద్ద టెస్ట్! 

మెగా ఫ్యామిలీలో చరణ్ .. బన్నీ తరువాత చాలా ఫాస్టుగా ఆడియన్స్ కి కనెక్ట్ అయిన హీరో సాయితేజ్ అనే చెప్పాలి. మెగాస్టార్ మాదిరిగా తెరపై చాలా యాక్టివ్ గా కనిపించడమే కాదు .. ఫైట్స్ లోను .. డాన్స్ లోను వంక బెట్టవలసిన అవసరం లేని హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. యూత్ తో పాటు మాస్  ఆడియన్స్ పల్స్ పట్టేసిన హీరోగా ఎదుగుతూ వచ్చాడు. హీరోగా ఇక నిలదొక్కుకున్నట్టేనని అందరూ అనుకుంటూ ఉండగానే ఆ మధ్య పెద్ద ప్రమాదం బారినపడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత ఆయన చేసిన సినిమానే ‘విరూపాక్ష’. బీఏవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ టచ్ ఉన్న హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడిచి ఉంటుందనే విషయం అర్థమైంది. ఇంతవరకూ ట్రై చేయని జోనర్లో సాయితేజ్ ఈ సినిమా చేశాడనే విషయం స్పష్టమైంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా షూటింగు సమయానికి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదనే విషయం ఇటీవల సాయితేజ్ మాటల వలన  అర్థమైంది. టీమ్ సహకారం వల్లనే తాను ఈ సినిమాను పూర్తి చేయగలిగానని చెప్పాడు. సాయితేజ్ మంచి ఈజ్ ఉన్న హీరో .. ఆల్రెడీ తనని తాను నిరూపించుకున్న హీరో. అయితే కాస్త గ్యాప్ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. ప్రమాదం నుంచి బయటపడిన తరువాత ఆయన చేసిన సినిమా ఇది. గతంలో మాదిరిగా సాయితేజ్ చేయగలిగాడా? .. లేదా? అనేది ప్రేక్షకులు తప్పకుండా గమనిస్తారు.  అందువలన ఈ సినిమా ఆయనకి ఇక పరీక్షలాంటిదే. ఈ పరీక్షలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : Virupaksha: ‘విరూపాక్ష’ నుంచి ‘నచ్చావులే నచ్చావులే’ సాంగ్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్