Tuesday, May 6, 2025
HomeసినిమాVirupaksha Pre Release: 'విరూపాక్ష' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్..!

Virupaksha Pre Release: ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. అందుకు ఏలూరులోని ‘సీఆర్ రెడ్డి కాలేజ్’ వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

ఇక రేపు ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితం వదిలారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాయి. ప్రమాదం కారణంగా గ్యాప్ తీసుకున్న సాయితేజ్, ఈ సినిమాతో హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్