రెండునెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ నగరం పరిపాలన రాజధాని కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడన అమర్నాథ్ తెలిపారు. వైజాగ్ సిటీని ఐటీ హబ్ గా చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారాయన. విశాఖలో రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి మాట్లాడారు.
భారతదేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. అతిత్వరలో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. అంతేకాదు అదానీ డేటా సెంటర్ ని కూడా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.
రెండోరోజు ఇన్ఫినిటి వైజాగ్ సదస్సులో మంత్రి అమర్నాథ్ తోపాటు ప్రముఖ ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో పెట్టుబడులకు ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ ఎంతో ఉపయోగపడిందని ఐటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైజాగ్ ఆసియాలోనే డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.