Saturday, January 18, 2025
HomeసినిమాMark Antony: 'మార్క్‌ ఆంటోనీ' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

Mark Antony: ‘మార్క్‌ ఆంటోనీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

విశాల్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’. ఈ మూవీకి అధిక్‌ రవిచంద్రన్‌ () దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌, సునీల్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్‌ బ్యాక్ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ ప్రకటించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి స్టార్ట్ అయ్యిన‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది.ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్‌ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రీతూవ‌ర్మ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్