Saturday, January 18, 2025
Homeసినిమా'విశ్వంభర' షూటింగ్ అప్ డేట్!

‘విశ్వంభర’ షూటింగ్ అప్ డేట్!

చిరంజీవి కథానాయకుడిగా ‘విశ్వంభర’ సినిమా రూపొందుతోంది. ‘బింబిసార’ సినిమాతో విజయాన్ని అందుకున్న శ్రీవశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇది సోషియో ఫాంటసీ నేపథ్యం అనేసరికి అందరిలో మరింత కుతూహలం బయల్దేరింది. ఈ సినిమాలో చిరంజీవి కాస్త యంగ్ లుక్ తోను .. మరి కాస్త ఓల్డ్ లుక్ తోను కనిపించనున్నారనేది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అలాంటి ఈ సినిమా కోసం భారీ షెడ్యూల్స్ నే ప్లాన్ చేస్తూ వెళుతున్నారు. తాజా షెడ్యూల్ రేపటి నుంచి మొదలుకానున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ పరిసరాలలో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ను ఒక సాంగ్ చిత్రీకరణతో మొదలుపెడుతున్నారని అంటున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు. కథలో ఒక కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. మెగాస్టార్ తో పాటు మరికొన్ని ముఖ్యమైన పాత్రలో ఈ పాటలో కనిపిస్తాయని అంటున్నారు.

ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా త్రిష కనిపించనుంది. ఇటీవలే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో సురభి – ఈషా చావ్లా అలరించనున్నారు. వెన్నెక కిశోర్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.  కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. జనవరి 10వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్