Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్, వివేక్ అగ్ని హోత్రి మధ్య గొడవ ఏంటి?

ప్రభాస్, వివేక్ అగ్ని హోత్రి మధ్య గొడవ ఏంటి?

ప్రభాస్, వివేక్ అగ్నిహోత్రి మధ్య ఏదో గొడవ జరిగిందని.. అందుకనే వివేక్.. ప్రభాస్ పై విమర్శలు చేస్తున్నారని సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే.. గత సంవత్సరం రాధేశ్యామ్ చిత్రం రిలీజైన రోజే తన సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ సాధించాడు వివేక్ అగ్నిహోత్రి. ఈసారి కూడా ‘సలార్’ విడుదల రోజునే ‘వ్యాక్సిన్’ వార్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. అయితే.. ప్రభాస్ కంటే తానే గొప్పవాడినని రుజువు చేయడం కోసం కావాలనే పోటీ పెట్టుకుంటున్నాడని.. ఆ మాట వివేక్ అగ్రిహోత్రి అన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై వివేక్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ఒక పెద్ద మెగాస్టార్ అని, చిన్న బడ్జెట్ చిన్న స్టార్లతో సినిమాలు తీసే తాను పోలిక ఎందుకు పెట్టుకుంటానని, అలాంటి దిగజారుడు స్టేట్ మెంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రచారంలో ఉన్న వార్తలను ఖండించాడు. అయితే.. సలార్ లాంటి డైనోసర్ మూవీతో ఎందుకు తలపడుతున్నారంటే మాత్రం అది కేవలం కాకతాళీయంగా జరిగిందే తప్పా కావాలని ప్లాన్ చేసింది కాదని అన్నారు. ఇటీవలే తెరమీద దేవుళ్ళుగా కనిపించేవాళ్ళు రాత్రి మందు కొడతారని వివాదాస్పద కామెంట్లు చేసిన వివేక్ అగ్నిహోత్రి అవి ఎవరిని ఉద్దేశించి అన్నారో క్లారిటీ ఇవ్వకపోయినా మాటలు మాత్రం వైరలయ్యాయి.

ఏదో ఒక రూపంలో వివేక్ అగ్నిహోత్రి వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా సమయంలో భారతదేశం పోరాడిన తీరు, వ్యాక్సిన్ కనుక్కోవడంతో మన డాక్టర్లు చేసిన కృషి, ప్రభుత్వం తీసుకున్న చర్యల చుట్టూ వివేక్ ది వ్యాక్సిన్ వార్ అనే చిత్రాన్ని రూపొందించారు. బయటికి పూర్తి వివరాలు ఇవ్వలేదు కానీ ఇందులో కూడా కాంట్రావర్సీ అంశాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ తో తనకు ఎలాంటి గొడవలు జరగలేదని.. క్లారిటీ ఇచ్చాడు. మరి.. సలార్ తో పోటీపుడుతున్న ది వ్యాక్సిన్ వార్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్