Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ కు నిరాశ  

ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ కు నిరాశ  

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు నాలుగోరోజు జరిగిన మూడు మ్యాచ్ లూ చివరి క్షణం వరకూ నరాలు తెగిపోయే ఉత్కంఠతో జరిగాయి. కేవలం ఒక ఒకటి రెండు పాయింట్ల తేడాతోనే మూడు జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్ ను డ్రా చేసుకున్న తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో ఒక పాయింట్ తో ఓటమి పాలైంది.

శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ పై యూపీ యోధ 36-35 తేడాతో విజయం సాధించింది. మొదటి అర్ధ భాగంలో 20-17తో వెనకబడిన యూపీ రెండో అర్ధభాగంలో పుంజుకొని 19-15తో ఆధిక్యం సాధించింది. ఆట చివరి నిమిషంలో లభించిన బోనస్ పాయింట్ తో యూపీ విజయం సాధించింది.

పునేరి పల్టాన్స్- తెలుగు టైటాన్స్ మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో ఆట మొదట్లో పునేరి దూసుకు పోయినా తర్వాత టైటాన్స్ చెలరేగి ఆడి తొలి అర్ధ భాగానికి 20-14 లీడ్ సంపాదించింది. రెండో భాగంలో అనవసర తప్పిదాలతో వెనకబడింది. రెండో హాఫ్ లో పునేరి 20-13 లీడ్ సాధించింది. 34-33 తో పునేరి గెలుపొందింది.

ఈ సిరీస్ లో జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజయం నమోదు చేసింది. నేటి మూడో మ్యాచ్ లో  హర్యానా స్టీలర్స్ పై 40-38తేడాతో గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 21-22 తో వెనుకబడినా; రెండో అర్ధభాగంలో 19-16 లీడ్ సాధించి మొత్తంగా రెండు పాయింట్ల ఆధిక్యం సంపాదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular