Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు పాటల తిక్క

తెలుగు పాటల తిక్క

Naatu Naatu Telugu Songs

“నా పాట సూడు
ఊర నాటు
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
గడ్డపార లాగ చెడ్డ నాటు
ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో..
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో”

త్రిబుల్ ఆర్ సినిమాలో పాట ఇది.

ఊరనాటు
పిచ్చ నాటు
వెర్రి నాటు
వీరంగం చేయడం
గడ్డపారలా చెడ్డనాటు
తిక్కనాటు
పదాలకు ఎవరయినా అర్థం చెబితే సంతోషిస్తాను.

కమర్షియల్ సినిమాల సాహిత్యం మీద సమీక్ష చేయకూడదని ఇంగితజ్ఞానం లేదా? అని మొన్న ఒక రచయిత జ్ఞానసంబంధ నయనాలు తెరిపించాడు.

అయితే ఈ పాట పుట్టుక గురించి పాట రచయిత చంద్రబోస్ పులకించి చెబుతున్న వీడియో అందుబాటులో ఉంది. అప్పటి భాష, పరిభాషలను ఆయన గ్రామీణ నేపథ్యం ఎలా ఒడిసిపట్టుకుని ఈ పాటలో బంధించిందో పూసగుచ్చినట్లు వివరించారు. అందువల్ల రాయాల్సి వస్తోంది.

గడ్డపార లాంటి మాచెడ్డ ఈ మంచి పాటకు నంది మొదలు ఆస్కార్ దాకా అన్ని అవార్డులు వచ్చి తీరాలి. ఆనాటి ఊరనాటు నోరారా నోరూరా ఊరూరా పాడుకోవాలి. పాటలో వెర్రి పిచ్చ మన మెదడులో పుచ్చకాయంతగా విచ్చుకోవాలి.

అయినా…
మన పిచ్చిగానీ…
ఇదే రచయిత, ఇదే దర్శకుడు, ఇదే మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో

“విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ అని
వినపడగానే…అలజడి రేగి హీరోయిన్ మిడ్డీ జారలేదా?

అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగా ఇవ్వగా…హీరో వడ్డీ మీద వడ్డి కట్టలేదా?

కన్నెబాడీ కాదమ్మో అది జీడిపప్పు జాడీ అని హీరో అంటే
పడుచు రైలు గాడీ పట్టాలు తప్పలేదా?

ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ?
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడీ?
వేస్తా బేడీ చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడీ అంటే ఆ రాత్రికి హీరో త్రీడీ చూడలేదా?

(మధ్యలో అత్యంత నీచమయిన ప్రస్తావనతో ఇంకో లైన్ కూడా ఉంది)

కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడీ
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి…
పంటకు పాడి నువ్వూ నేనొక జోడీ
చింతల్‌పూడి చిలకల్‌పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు…
విశాఖ ఉక్కు కడ్డీ”

విశాఖ ఉక్కు కడ్డీ మిడ్డీ జారి దైన్యంగా నడిబజారులో నాథుడు లేక ఎలా ఉందో చూస్తున్నాం. తెలుగుపాట కూడా ఎప్పుడో మిడ్డీ జారిపోయి విశాఖ ఉక్కు కడ్డీలా వివస్త్రగా నడిబజారులో దైన్యంగా నా అన్నవాడు లేక నిలుచుని ఉంది.

రౌడీ కేడీలు రాత్రిళ్లు నీచ ప్రాసల త్రీడీలు చూపిస్తుంటే వేడి వేడి చెక్కులు డీ డీ లుగా మారి అప్పటికప్పుడు కలెక్షన్ల క్యాష్ అవుతున్నాయి.

ఇలాంటి ఉక్కు కడ్డీల నాటో నాటు పాటలకు దర్శకుడు- ప్రపంచ ప్రఖ్యాత రాజమౌళి; సంగీతం- ఎం ఎం కీరవాణి; రచయిత- చంద్రబోస్.

తెలుగు పాటలకు…
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

తెలుగు గేయానికి లాఠీ గాయక్

Also Read:

రాయినయినా కాకపోతిని!

Also Read:

భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్