Monday, April 21, 2025
HomeTrending Newsఉయ్యూరు ఫౌండేషన్ ఎండి శ్రీనివాస్ అరెస్ట్

ఉయ్యూరు ఫౌండేషన్ ఎండి శ్రీనివాస్ అరెస్ట్

నిన్న గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ ఎండి ఉయ్యూరు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి సభ నిర్వాహకుల పై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దీనికి బాధ్యుడైన శ్రీనివాస్ పై సెక్షన్ 304/2, సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.  నేడు విజయవాడ ఏలూరు రోడ్డులో ఓ హోటల్ లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.

నిన్న గుంటూరు వికాస్ నగర్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో ‘చంద్రన్న కానుక – జనతా వస్త్రాలు’ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టింది, అయితే వారం రోజులుగా పలువురికి కూపన్లు పంపిణీ చేశారు, తీరా నిన్న కేవలం కొంతమందికి మాత్రమే పంచుతామని, మిగిలిన వారికి త్వరలో పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కసారిగా చీరలు, నిత్యావసరాలకోసం ప్రజలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దీనితో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గుంటూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్