Sunday, January 19, 2025
Homeసినిమామే 9న ‘సీతా రామం’ ఫస్ట్ సింగల్

మే 9న ‘సీతా రామం’ ఫస్ట్ సింగల్

First one: వెండితెర పై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ ‘సీతా రామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ ‘ఓ సీతా- హే రామా’ మే 9న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ వర్షంలో తడుచుకుంటూ హీరోయిన్ మృణాళినిని ఫాలో అవుతున్న విజువల్ ఆకట్టుకుంది. ఈ లవ్లీ పోస్టర్ ప్రకారం.. ఈ పాట ప్లెజంట్ రొమాంటిక్ నంబర్‌గా ఉండబోతోందని అర్ధమౌతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Also Read :  దుల్కర్ సల్మాన్  చిత్రానికి  ‘సీతా రామం’ టైటిల్ ఖరారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్