Sunday, January 19, 2025
Homeసినిమాగోపీ, బాబీ.. నెక్ట్స్ ఏంటి..?

గోపీ, బాబీ.. నెక్ట్స్ ఏంటి..?

చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సంక్రాంతికి వచ్చిన మరో భారీ చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రాన్ని మలినేని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వచ్చిన ఇద్దరు దర్శకులు హిట్లు కొట్టారని దాదాపుగా తెలుగు ప్రేక్షకులందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ దర్శకుల నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు… గోపీచంద్ మలినేని పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేయడం కోసం స్టోరీ రెడీ చేశారు. అయితే.. పవన్ వరుస సినిమాలతో బిజీ. అలాగే ఎన్నికల నేపధ్యంలో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకవు కాబట్టి.. మలినేని గోపీచంద్ తరువాతి చిత్రం క్రాక్-2 అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే.. ఇంట్రస్టింగ్ గా బాలయ్య కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నారట. బాలయ్య ఏమో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు బాబీ విక్టరీ వెంకటేష్ కోసం కూడా కథ రెడీ చేస్తున్నారని టాక్. వీటితో పాటు రామ్ పోతినేని లేదా నాని హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా.. బాబీ, గోపీల నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్