Saturday, January 18, 2025
Homeసినిమావిదేశాలకు వెళుతున్న వాల్తేరు వీర‌య్య‌.

విదేశాలకు వెళుతున్న వాల్తేరు వీర‌య్య‌.

Foreign Veeraiah: మెగాస్టార్ చిరంజీవి హీరోగా  బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో మత్స్య కారుడిగా, మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నారు. తమ జీవితాలపై పెత్తనం .. తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా ఈ సినిమాలో చిరంజీవి పోరాటం సాగుతుందట‌.

ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. చిరంజీవి లుక్ ఊర మాస్ గా ఉండ‌డంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజా వార్త ఏంటంటే.. కీల‌క స‌న్నివేశాల‌ను మలేసియాలో చిత్రీకరించనున్నారు. అందువలన ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ భారీ క్రేజీ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో లేదా అక్టోబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆత‌ర్వాత వాల్తేరు వీర‌య్య చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. అయితే… వాల్తేరు వీర‌య్య రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : చిరు 154 మూవీ టైటిల్ ఇదే  

RELATED ARTICLES

Most Popular

న్యూస్