Saturday, January 18, 2025
Homeసినిమా'వాల్తేరు వీరయ్య' ఇంట్రస్టింగ్ అప్ డేట్

‘వాల్తేరు వీరయ్య’ ఇంట్రస్టింగ్ అప్ డేట్

చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో వాల్తేరు వీరయ్య ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

అయితే… ‘గాడ్ ఫాదర్’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఫరవాలేదు అనిపించారు కానీ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయారు. దీంతో ఈసారి సంక్రాంతికి వస్తున్న వాల్తేరు వీరయ్యతో రికార్డు కలెక్షన్స్ సాధించాలి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలని చిరంజీవి తపిస్తున్నారు. అయితే.. గాడ్ ఫాదర్ మూవీకి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం చాలా ఆలస్యం అయ్యింది. ఈ కారణంగా గాడ్ ఫాదర్ పై బజ్ ఏర్పడడానికి చాలా టైమ్ పట్టింది. ఒక దశలో ఏమాత్రం బజ్ లేదు. కలెక్షన్స్ వస్తాయో రావో అనుకుంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు స్పీచ్ తో బజ్ క్రియేట్ చేశారు.

గాడ్ ఫాదర్ మూవీకి ప్రమోషన్స్ ఆలస్యం అయినట్టుగా ఈసారి కాకుడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచాలి అనుకుంటున్నారు. అందుకనే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మాస్ సాంగ్స్ రెడీ చేశాడట. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను త్వరలో ఇవ్వనున్నారు మేకర్స్. ఈ ఊర మాస్ సాంగ్ తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిరు డిసైడ్ అయ్యారట. మొత్తానికి గాడ్ ఫాదర్ మూవీతో ప్రమోషన్స్ విషయంలో గుణపాఠం నేర్చుకున్నారు ఆచార్య అంటున్నారు సినీజనాలు.

Also Read : వాల్తేరు వీరయ్య లో మరో స్పెషల్ రోల్?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్