Sunday, January 19, 2025
Homeసినిమా'వాల్తేరు వీరయ్య' సెకండ్ సింగిల్ అదిరింది.

‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సింగిల్ అదిరింది.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.

వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటి వరకు టీజర్ అండ్ పార్టీ సాంగ్ రిలీజ్ చేయగా వీటికి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంట అనే పాటను రిలీజ్ చేశారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించారు. ఈ పాట చిత్రీకరణ అవుట్ అండ్ అవుట్ కలర్ ఫుల్ అండ్ క్లాస్ గా వుంది. ఫారిన్ లోకేషన్ లో చిత్రీకరించిన ఈ పాటలో మెగాస్టార్ లుక్ చూస్తే.. ఓ ఇరవై ఏళ్లు వయసు తగ్గినట్లు కనిపించారు. అలాగే ఈ పాటలోని డ్యాన్స్ మూవ్ మెంట్స్ సూపర్ అనేలా ఉన్నాయి.

థియేటర్లో ఈ పాట చూస్తే… అభిమానులకు పండగే అని చెప్పచ్చు. ఈ సినిమా గురించి చెప్పాలంటే… మెగా అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఈ కథను బాబీ రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరి.. వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్