Saturday, January 18, 2025
Homeసినిమావాల్తేరు వీర‌య్య టీజ‌ర్ రెడీ...

వాల్తేరు వీర‌య్య టీజ‌ర్ రెడీ…

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’తో హిట్ సాధించారు. మోహ‌న‌రాజా డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ మూవీ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. దీని త‌ర్వాత చిరంజీవి చేస్తున్న మూవీ ‘వాల్తేరు వీర‌య్య‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.

దీనికి ఓ స్పెష‌ల్ రీజన్ ఉంది. ఏంటంటే… చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150, గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్ ఇలా రీమేక్ చిత్రాలు చేస్తున్న టైమ్ లో ఓరిజిన‌ల్ స్టోరీతో చేస్తున్న మూవీ వాల్తేరు వీర‌య్య‌. పైగా బాబీ మెగాస్టార్ అభిమాని. అందుచేత ఈ సినిమా క‌థ ఏంటి..?  అభిమాని అయిన బాబీ మెగాస్టార్ ను ఎలా చూపించ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

చిరంజీవి పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే.. దీపావ‌ళి కానుక‌గా వాల్తేరు వీర‌య్య నుంచి టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని చిరంజీవి ఇటీవ‌ల క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌కు చెప్పారు. ఆ టీజ‌ర్ తో పాటు టైటిల్ ను ప్ర‌క‌టిస్తార‌ట‌. అలాగే సంక్రాంతికి వ‌స్తున్న డేట్ కూడా ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. సో.. దీపావ‌ళికి మెగా అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌.

Also Read : చిరు, బాల‌య్య పోటీ సంక్రాంతికి ఉందా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్