Sunday, January 19, 2025
HomeTrending Newsదేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు : సీఎం కేసీఆర్

దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు : సీఎం కేసీఆర్

అంద‌ర్నీ క‌లుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు.. విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. వ‌రంగ‌ల్‌ జిల్లా ములుగు రోడ్డులో ఈ రోజు  ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఈ దేశం చాలా గొప్ప దేశం. స‌హ‌న‌శీల‌త దేశం. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే దేశం. పోరాటాల‌తో ముందుకు పోయే దేశం. అంద‌ర్నీ క‌లుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూల‌బోకే లాంటి గొప్ప దేశం. ప్రేమ‌తో బ‌తికేట‌టువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదు.. ఏ ర‌కంగా కూడా స‌మాజానికి మంచిది కాదు. నా వ‌య‌సు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భ‌విష్య‌త్ మీది.. ఈ భార‌త‌దేశం మీది. విద్యార్థులుగా, యువ‌కులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే క‌ర్తవ్యం మీ మీద ఉంట‌ది. మెడిక‌ల్ విద్య‌తో పాటు సామాజిక విద్య‌ను కూడా పెంపొందించుకోవాలి. ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.

Also Read : యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్