Monday, March 17, 2025
HomeTrending NewsYS Jagan:పూలే మార్గంలోనే మా పయనం: సిఎం

YS Jagan:పూలే మార్గంలోనే మా పయనం: సిఎం

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  తదితరులు  పాల్గొన్నారు.

“అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు” అంటూ సిఎం తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్