Saturday, April 5, 2025
HomeTrending Newsఏపీలో వనరులు పుష్కలం : సిఎం జగన్

ఏపీలో వనరులు పుష్కలం : సిఎం జగన్

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ప్రోత్సహకాలూ అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము సింగల్ డెస్క్ పోర్టల్‌ సదుపాయం అమలు చేస్తున్నామని, దీని ద్వారా 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులు మంజూరు చేస్తున్నామని… కరెంటు, నీరు సరసమైన ధరలకే పరిశ్రమలకు అందజేస్తున్నామని వివరించారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు  కర్టెన్ రైజర్ సమావేశంలో సిఎం ముగింపు ఉపన్యాసం ఇచ్చారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • 974 కి.మీ తీర  ప్రాంతం రాష్ట్రానికి ఉంది
  • 6 పోర్టులు ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, మరో 4 కూడా ఏర్పాటవుతున్నాయి
  • అలాగే 6 ఎయిర్‌ పోర్టులు ఉన్నాయి, ౩ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి

  • దాదాపు 80శాతం జిల్లాలు ఈ కారిడర్లలో ఉన్నాయి
  • 48 ఖనిజాలు ఏపీలో కనిపిస్తున్నాయి
  • ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం
  • 2021-22లో 11.43 వృద్ధిరేటు సాధించాం
  • మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్ లో నంబర్‌ ఒన్‌గా ఉన్నాం

  • పారిశ్రామిక వేత్తలు ఈ ర్యాంకుల నిర్ధారణలో భాగస్వాములు
  • అలాంటి వారి ఫీడ్‌బ్యాక్‌ నుంచి ఈర్యాంకులు ఇస్తున్నారు
  • అనేక అవార్డులు కూడా గెల్చుకున్నాం
  • తయారీ రంగంలో అనేక క్లస్టర్లు కూడా రాష్ట్రంలో ఉన్నాయి

  • మీరు ఏపీకి రండి, రెన్యువబుల్‌ ఎనర్జీ విషయంలో ఏపీకి పుష్కలమైన వనరులు ఉన్నాయి
  • 33వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది
  • పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సమస్య ఉన్నా.. ఫోన్‌కాల్‌లో అందుబాటులో ఉంటాం

  • మీరు ఇక్కడకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు
  • మళ్లీ మనం అందరం వైజాగ్‌లో కలుసుకుందాం

అంటూ  పారిశ్రామిక వేత్తలకు సిఎం  జగన్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్