Saturday, May 3, 2025
HomeTrending NewsVizag Steel: అది ఎత్తుగడే: కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్

Vizag Steel: అది ఎత్తుగడే: కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ను బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు.  ప్లాంట్ ను ప్రైవేటీకరణపై ముందుకు వెళ్ళడం లేదని,  ప్లాంట్ లో కొత్త విభాగాలను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. విశాఖ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఫగ్గన్ సింగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందించారు.

స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్ధ్యంతో పనిచేసేలా దాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తో పాటు కార్మికులతో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు. మూలధనం పెట్టుబడి పెట్టి దానికి బదులుగా ఉక్కును తీసుకునేలా ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విడుదల చేశామని, ఈ బిడ్ లో తెలంగాణా ప్రభుత్వం పాల్గొనడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహించిన నాలుగో విడత ఉపాధి మేళా నిర్వహించారు. జాతీయ స్థాయిలో 71,506 మందికి దీని ద్వారా ఉపాధి లభించింది. విశాఖలో ఉపాధి పొందిన యువతకు కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్