It is up to him: మతం, కులం ప్రాతిపదికన ఓట్లు అడిగే వ్యవస్థలను దూరం పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పిలుపు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచిది కాదని హితవు పలికారు.
పవన్ కళ్యాణతో ఎవరితో పొత్తు పెట్టుకుంటాడనేది తమకు సంబంధం లేదని, ఒకవేళ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా తమకు అనవసరమనన్నారు. ‘పవన్ కళ్యాణ్ ను మొత్తం 175 సీట్లులో సింగల్ గా పోటి చేయమనండి’ అంటూ నారాయణ స్వామి సవాల్ విసిరారు. తాము సింగిల్ గానే పోటి చేస్తామని, మొదటి నుంచీ తమది అదే విధానమని స్పష్టం చేశారు.
మరోవైపు, వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కళ్యాన్ పొత్తు బిజేపితోనా, టిడిపి తోనా లేక రెండు పార్టీలతో కలిసి పోటీ చేశారా అన్నది తమకు అనవసరమని బాలినేని వ్యాఖ్యానించారు. అయన మూడు ఆప్షన్స్ పెట్టుకుంటారో నాలుగు పెట్టుకుంటారో తమకు సంబంధించిన అంశం కాదన్నారు.