Saturday, January 18, 2025
HomeTrending Newsరాజకీయ ఆలోచన లేదు: అదానీ

రాజకీయ ఆలోచన లేదు: అదానీ

No question: రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తమా కుటుంబంలో ఎవరికీ లేదని పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.  అదానీ లేదా అయన భార్య డా. ప్రీతీ అదానీ ఆంద్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తారని, వారికి ఒక సీటు కేటాయిస్తూ సిఎం జగన్ నిర్ణయం కూడా తీసుకున్నారని కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గౌతమ్ అదానీ ఆర్నెళ్ళ క్రితం తాడేపల్లి వచ్చి జగన్ తో రహస్యంగా సమావేశమైనట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి, నాటి నుంచే ఈ రాజ్య సభ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని గౌతమ్ అదానీ ఖండించారు. నేడు ఓ ప్రకటన విడుదలైంది.

రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేర్లను తెరపైకి తెస్తున్నారని ప్రకటనలో పేర్కొన్న ఆయన,  రాజ్యసభ సీట్ల విషయంలో మా పేరును లాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.  గౌతమ్ అదానీ లేదా డాక్టర్ ప్రీతి అదానీ లేదా అదానీ కుటుంబ సభ్యులెవరికీ రాజకీయ జీవితంపై ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్