Monday, January 20, 2025
HomeTrending NewsPeddireddy: అప్పుడు విడాకులు... ఇప్పుడు మళ్ళీ

Peddireddy: అప్పుడు విడాకులు… ఇప్పుడు మళ్ళీ

చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యారు కాబట్టే ఇతర పార్టీల సహకారం అడుగుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల ముందు టిడిపి-బిజెపిలు విడాకులు తీసుకున్నాయని, ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి  2014 లాగా టిడిపి-బిజెపి-జనసేన కలిసి పోటీచేస్తారేమో అంటూ వ్యాఖ్యానించారు. బిజెపితో తాము ఏనాడూ దోస్తీ కట్టలేదని స్పష్టం చేశారు.  అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు జగనన్న లేఔట్‌ పక్కన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన కుటుంబానికి చేనిన తోపుదుర్తి సహకార డెయిరీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమ్మ డెయిరీ’ పెద్దిరెడ్డి నేడు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తమకు ప్రజా బలం ఉందని, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, ప్రజలు సిఎం జగన్ కు జేజేలుకోడుతున్నారని… వచ్చే ఎన్నికలలోనూ తాము ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  రాయలసీమకు  తాము ఏమి చేశామో ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్