We are Ready: పదో తరగతి పాస్ శాతం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదని, విద్యార్ధులు రాసినదాన్ని బట్టి ఉంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫలితాలపై బహిరంగ చర్చకు రావాలంటూ లోకేష్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నామని, దమ్ముంటే లోకేష్ స్వయంగా కానీ, అయన బాబు కానీ రావొచ్చని ప్రతి సవాల్ చేశారు. నిన్నటి లోకేష్ జూమ్ మీటింగ్ కు తమ పార్టీ నేతలు వస్తే లోకేష్ పారిపోయారని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులిద్దరూ తమ విధానాలు మార్చుకోవాలని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని వన్ టౌన్ లోని స్వాతి థియేటర్ సెంటర్లో ప్రారంభించారు. విజయసాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాలపై టిడిపి అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో విమర్శించాలి గానీ, ఇలాంటి దుష్ప్రచారం తగదన్నారు. నిన్నటి ఘటన ఓ శాంపిల్ మాత్రమేనని, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు.
తాము అధికారంలోకి రావడంలో పార్టీ కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని, వారిని ఎత్తి పరిస్థితుల్లో విస్మరించే ప్రసక్తే లేదని విజయసాయి భరోసా ఇచ్చారు. టిడిపి కావాలనే తమ పార్టీ కార్యకర్తల్లో కల్పిస్తోందని విమర్శించారు. నూటికి నూరు శాతం అందరినీ సంతృప్తి పర్చలేమని కానీ 90శాతం వరకూ న్యాయం చేశామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే పదవులు దక్కుతాయన్నారు. శాంతి భద్రతలు, విఐపీ సెక్యూరిటీ దృష్ట్యా పోలీసులు కొన్ని ప్రాంతాలకు నేతలను అనుమతించబోరని, అదే కోవలో సోము వీర్రాజుని ఆపి ఉండొచ్చని, ఉద్దేశ పూర్వకంగా ఎవరినీ అపబోరని అన్నారు.
Also Read : విద్యార్ధులతో లోకేష్ రాజకీయం: నాని