Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్కోహ్లీకి మంచిదే: బ్రాడ్ హాగ్

కోహ్లీకి మంచిదే: బ్రాడ్ హాగ్

We Can Expect Some Good Cricket From Kohli Now Brad Hogg :

వన్డే జట్టు సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం అతనికే మంచిదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డారు.  ఒకరకంగా ఇది కోహ్లీకి గొప్ప అవకాశం లాంటిదేనని, ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలవుతుందని చెప్పాడు. తన యూ ట్యూబ్ ఛానల్ లో ఈ విషయమై హాగ్ మాట్లాడాడు.

ఇటీవల వరల్డ్ కప్ టి20 టోర్నమెంట్ అనంతరం పొట్టి ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలనుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్ కు రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఈ నెలలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్, వన్డే సిరీస్ లో టెస్టు జట్టుకు కోహ్లీ, వన్డే జట్టుకు రోహిత్ లను కెప్టెన్లు గా బిసిసిఐ ఎంపిక చేసింది. కోహ్లీ టి20 నుంచి మాత్రమే వైదొలగాలని నిర్ణయించుకోగా వన్డేలకు సైతం అతన్ని బాధ్యలనుంచి తప్పించడంపై విమర్శలు తలెత్తాయి. కోహ్లీ పట్ల బిసిసిఐ అవమానకరంగా, అమర్యాదగా ప్రవర్తించిందని అతని అభిమానులతో పాటుగా పలువురు క్రికెట్ విశ్లేషకులు, ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బిసిసిఐ కోహ్లీ వన్డే జట్టు కెప్టెన్ గా అందించిన సేవలు అపురూపమైనవని శ్లాఘిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

దీనిపై బ్రాడ్ హాగ్ స్పందిస్తూ… వైట్ బాల్ (టి 20, వన్డే); రెడ్ బాల్ (టెస్టు) క్రికెట్ లకు  వేర్వేరు కెప్టెన్ లను నియమించడం సరైన చర్యే అవుతుందన్నాడు. కొంత భారం తగ్గుతుందని, అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అయితే తీవ్రమైన ఒత్తిడి, శ్రమ ఉంటాయని చెప్పాడు. కోహ్లీకి ఇదొక ఉపశమనమని, ఇకపై అతని నుంచి మెరుగైన ఆట చూడోచ్చని చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం నుంచి కోహ్లీ త్వరగా బైటపడి ఆటపై దృష్టి సారించాలని సూచించాడు.

Also Read :రోహిత్ శర్మకే సారధ్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్