Monday, June 15, 2026
Homeసినిమానజ్రియా లేకుండా సుందరాన్ని ఊహించుకోలేం: నాని 

నజ్రియా లేకుండా సుందరాన్ని ఊహించుకోలేం: నాని 

Nazriya:  నాని హీరోగా ‘అంటే .. సుందరానికీ’ సినిమా రూపొందింది. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడికి, ఒక క్రిస్టియన్ యువతికి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది కథ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, మలయాళ సుందరి ‘నజ్రియా’ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఎంతో క్రేజ్ ఉన్న మలయాళంలోనే సినిమాకీ .. సినిమాకి గ్యాప్ తీసుకునే ఆమె, తెలుగులో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం విశేషం. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను వివేక్ ఆత్రేయ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. అలా నచ్చినప్పుడు హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారు? అని అడుగుతూ ఉంటాను. కానీ ఈ కథ వినగానే హీరోయిన్ గా నజ్రియా అయితే బాగుంటుందని అన్నాను. ఎందుకంటే గతంలో తాను చేసికొన కొన్ని సినిమాలు చూశాను .. పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు తెలుసు. అందువల్లనే ఆమె పేరు చెప్పాను .. కానీ చేస్తుందా లేదా అనేది డౌటు. దాంతో వివేక్ ఆత్రేయ వస్తాడు .. ఒకసారి కథ వినమని మెసేజ్ చేశాను.

నిజానికి నజ్రియా మొహమాటానికి కథ విన్నారు .. కానీ నిజంగానే ఆమెకి కథ నచ్చేసింది. ఆ పాత్రను చేయడానికి ఆమె అంగీకరించింది. లీలా థామస్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో ఆమె నటన చూసి మాకే ఆశ్చర్యం వేసింది. ఒకవేళ ఈ సినిమా చేయడానికి  ఆమె ఒప్పుకోకపోతే ఆ పాత్రకి ఎవరిని తీసుకునేవాళ్లం అనే ప్రశ్న వేసుకుంటే ఎవరూ కనుపించలేదు. ఆ పాత్రను ఆమె అంత గొప్పగా చేశారు. ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనది గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని చెప్పుకొచ్చాడు.

Also Read : నజ్రియాకి టాలీవుడ్ నచ్చేసినట్టే!    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular