Saturday, January 18, 2025
HomeసినిమాVishal: విశాల్ తో దాగుడుమూతలు ఆడుతున్న సక్సెస్! 

Vishal: విశాల్ తో దాగుడుమూతలు ఆడుతున్న సక్సెస్! 

విశాల్ కి తమిళ .. తెలుగు భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. తన సినిమాల్లో యాక్షన్ .. ఎమోషన్ తో పాటు కామెడీ కూడా ఉండేలా విశాల్ చూసుకుంటూ ఉంటాడు. తన సినిమాల నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఉండేలా చూసుకునే విశాల్, యాక్షన్ విషయంలో ఎప్పుడూ మంచి మార్కులను దక్కించుకుంటూనే వెళుతున్నాడు. అలా తనదైన యాక్షన్ మార్కుతో ఆయన చేసిన సినిమానే ‘మార్క్ ఆంటోని’.

సాధారణంగా విశాల్ వైవిధ్యం కలిగిన పాత్రలనే చేస్తూ వెళుతూ ఉంటాడు. అయితే లుక్ పరంగా ఆయన కొత్తగా కనిపించడానికి చేసిన ప్రయత్నాలు తక్కువనే చెప్పాలి. ఈ సారి మాత్రం ఆయన ఈ సినిమా కోసం విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాకి ఇది ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ‘వినాయక చవితి’ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. పక్కా మాస్ లుక్ తో ఆయన చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

నిజానికి విశాల్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. అందువలన తన వైపు నుంచి గట్టి హిట్ ఇవ్వడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. తమిళంలో సంగతి అలా ఉంటే, తెలుగులో పెద్దగా పోటీలేని వారంలో ఈ సినిమా థియేటర్స్ కి వస్తోంది. ఏ మాత్రం కంటెంట్ ఉన్నప్పటికీ కలిసొచ్చే వారమే ఇది. మరి ఈ సినిమాలో ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఏ స్థాయిలో ఉందో చూడాలి. ఈ సారైనా విశాల్ కి హిట్ పడుతుందేమో వెయిట్ చేయాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్