Sunday, January 19, 2025
HomeTrending Newsమీరే పెద్ద ఉన్మాదులు: మంత్రి రోజా

మీరే పెద్ద ఉన్మాదులు: మంత్రి రోజా

Be careful: సిఎం జగన్ మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు సిఎం జగన్ ప్రవేశపెట్టారని, అందుకే నీతి ఆయోగ్ కూడా మహిళా సాధికారతలో రాష్ట్రాన్ని ప్రశంసించిందని రోజా అన్నారు.  సిఎం జగన్ మహిళా పక్షపాతిగా, వారికి ఆర్ధికంగా చేయూత ఇవ్వడం కోసం  అనేక చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ భాగం మహిళల పేరుమీదే ఇస్తున్నామని వివరించారు.

ఊరికో ఉన్మాది పేరిట టిడిపి చేపట్టిన ఆందోళనను రోజా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ మహిళా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టని చంద్రబాబు ఇప్పుడు మహిళల కోసం ఉద్యమాలు మొదలు పెట్టారని రోజా విమర్శించారు. టిడిపిలో ఉన్నంత ఉన్మాదులు మరెక్కడా లేరని, అందరికంటే పెద్ద ఉన్మాది చందబాబే అన్నారు రోజా.  సిఎం జగన్, భారతమ్మలను కించపరిచేవిధంగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారని, దీన్నిఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రోజా హెచ్చరించారు.  తమ నేతలకు చీరలు కట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకే ఉందని, వారికి ఏ చీర కావాలో చెబితే తాము పంపుతామని బదులిచ్చారు.   దమ్ము గురించి టిడిపి నేతలు మాట్లాడుతున్నారని, జగన్ దమ్ము ఏమిటో 12 ఏళ్ళుగా చూస్తున్నామని, కానీ ఏనాడూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేని చంద్రబాబుకే దమ్ములేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న  ఉన్మాదులు మరెక్కడా లేరని… గత చంద్రబాబు హయాంలో  వనజాక్షి, రిషితేశ్వరి, గుంటూరు జానీమూన్, బూటు కాలితో మహిళను తన్నిన అచ్చెన్నాయుడు… లాంటి ఉదంతాలు ఎవరూ మర్చిపోరన్నారు.

విజయవాడ ఆస్పత్రిలో బాధితురాలికి పరామర్శ పేరుతో  హడావుడి చేశారని, సాక్షాత్తూ మహిళా కమిషన్ ఛైర్మన్ పట్ల అనుచితంగా ప్రవరించారని, టిడిపి మహిళా ద్రోహి పార్టీ అని దుయ్యబట్టారు. పిచ్చి పిచ్చి అందోళనలు చేసి తమను రెచ్చగొట్టడం తగదన్నారు.

Also Read : సిగ్గుపడుతున్నా: చంద్రబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్