Wednesday, January 22, 2025
HomeTrending NewsKesineni: వాలంటీర్ల వ్యవస్థ మంచిదే

Kesineni: వాలంటీర్ల వ్యవస్థ మంచిదే

ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనని, నలుగురైదుగురు తప్పుచేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం మంచిది కాదని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాలంటీర్లు అయినా, గతంలో జన్మభూమి కమిటీలు అయినా ప్రజల కోసం ఏర్పాటు చేసినవేనని, వాటి వల్ల మంచి జరిగిదే అందరూ ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా, ప్రజలకు మేలు చేస్తే.. ఏ వ్యవస్థ నైనా కొనసాగిస్తామన్న విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ పనుల అవసరార్థం పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు భారీ రాయితీ తో ట్రాక్టర్లు పంపిణీ రెండో విడతను నేడు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

వారిని ఏ ప్రభుత్వం నియమించింది అనేది కాకుండా ప్రజల కోసం ఎవరైనా పని చేస్తుంటే అది మంచిదేనని కేశినేని నాని చెప్పారు.  ఏ వ్యవస్థ అయినా మంచి కోసమే ఏర్పాటు  చేస్తారని, కానీ ఈ మధ్య వారిలో కొందరు పార్టీకోసం పనిచేస్తున్నారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్